హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: మూత్రశాలలు లేక చిన్నారుల పాట్లు

BDK: పినపాక మండల పరిధిలోని పెంటన్నగూడెం గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చిన్నారి విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. పాఠశాలలో విద్యార్థుల కోసం ప్రభుత్వ నిధులతో నిర్మించిన మూత్రశాలలు కేవలం కాగితాలకే పరిమితమై, వాడుకకు నోచుకోకపోవడంతో చిన్నారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మూత్రశాలలు అందుబాటులోకి తేవాలని కోరారు.