హైదరాబాద్: 28°C
క్రీడలు

కామన్వెల్త్ ముగింపు వేడుకలకు ప్రధాని మోదీ!

2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య బాధ్యతలను భారత్(అహ్మదాబాద్) స్వీకరించనుంది. ఆగస్టు 2న గ్లాస్గోలో జరిగే 2026 క్రీడల ముగింపు వేడుకల్లో అధికారిక పతాక స్వీకరణ సందర్భంగా గాయకుడు శంకర్ మహదేవన్, నటి రష్మిక మందన్నల 20 నిమిషాల సాంస్కృతిక ప్రదర్శన అలరించనుంది. ఈ ముగింపు ఉత్సవాలకు ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. కాగా, గ్లాస్గోలో భారత్ నుంచి 126 మంది అథ్లెట్లు బరిలో దిగుతున్నారు.