హైదరాబాద్: 28°C
వార్తలు

బాధితులకు పరామర్శ.. కుక్కల నివారణకు హామీ..!

MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో సంచరిస్తున్న వీధి కుక్కలను పట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు కౌన్సిలర్ గజవాడ నాగరాజు తెలిపారు. మంగళవారం ఎస్సీ కాలనీలో కుక్కల దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించి, వైద్య సాయం అందిస్తామన్నారు. పట్టణంలో వీధి కుక్కలను బంధించి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.