ASF: కౌటాల మండల MPDO కార్యాలయానికి స్పష్టమైన పేరు బోర్డు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయానికి కనీస బోర్డు కూడా లేకపోవడం అధికారుల అలసత్వానికి నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చే ప్రజలు కార్యాలయాన్ని గుర్తించలేకపోతున్నారని, అధికారులు వెంటనే స్పందించి బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
వార్తలు
VIDEO: 'కార్యాలయానికి నామకరణ బోర్డు ఏర్పాటు చేయాలి'


