హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మొలకెత్తిన పెసళ్లతో ఆరోగ్యం

పప్పుధాన్యాలను మొలకెత్తించడం ద్వారా వాటిలోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్ల సాంద్రత పెరుగుతుంది. విత్తనాలు మొలకెత్తినప్పుడు అవి శరీరానికి సులభంగా అరిగేలా చేస్తాయి. మొలకెత్తిన పెసళ్లు తింటే త్వరగా జీర్ణమవుతుంది. వీటిలో ప్రోటీన్, డయాబెటిక్ ఫైబర్, విటమిన్ C, K పుష్కలంగా లభిస్తాయి. పెసళ్లలో కేలరీల శాతం తక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి అద్భుతమైన డైట్ ఆప్షన్.