హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

అంజీరతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు

అంజీర తినడం వల్ల శరీరానికి బోలెడన్ని పోషకాలు లభిస్తాయి.అంజీరలో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పొటాషియం శరీరంలో సోడియం స్థాయిలను సమతుల్యం చేసి, అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అలాగే వీటిలో  కాల్షియం, మెగ్నీషియం, సమృద్ధిగా ఉండటం వల్ల ఇవి ఎముకలను, పళ్లను దృఢంగా మారుస్తాయి. పిల్లలు, మహిళలకు ఇది అద్భుతమైన పోషకాహారం.