MDK: శివంపేట పాంబండ 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో అత్యవసర మరమ్మతుల నిమిత్తం బుధవారం మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ నరేందర్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ కోత అమలులో ఉంటుందన్నారు. విద్యుత్ అంతరాయం పట్ల సబ్‌స్టేషన్ పరిధిలోని ప్రజలు, రైతులు అవసరమైన ఏర్పాట్లు చేసుకుని సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
వార్తలు
రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత


