హైదరాబాద్: 28°C
క్రీడలు

శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు..

శ్రీలంక అండర్-19తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత యువ జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో కుశాగ్ర ఓజా (111), మనాల్ చౌహాన్ (150) సెంచరీలతో భారత్ 411 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకను భారత బౌలర్లు దెబ్బతీశారు. రెండో రోజు ఆట ముగిసేసరికి లంక 122 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి 289 పరుగులు వెనుకబడింది.