హైదరాబాద్: 28°C
క్రీడలు

శ్రీలంక సిరీస్‌.. స్టార్ ప్లేయర్స్ ఎంట్రీ?

ఇంగ్లండ్‌పై వరుస సిరీస్ పరాజయాల తర్వాత భారత జట్టుకు ఊరటనిచ్చే వార్త లభించింది. AUG 15 నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్‌కు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా పునరాగమనం చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు BCCI ప్రణాళిక సిద్ధం చేసిందని, ఈ వారంలోనే టెస్ట్ జట్టు ప్రకటన వెలువడే అవకాశముందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.