హైదరాబాద్: 28°C
వార్తలు

జగన్‌ను కలిసిన మాజీ పీడీడీసీ బ్యాంక్ ఛైర్మన్

ప్రకాశం: తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్‌ను క్యాంపు కార్యాలయంలో సోమవారం కనిగిరికి చెందిన ప్రకాశం జిల్లా మాజీ పీడీడిసీ బ్యాంక్‌ ఛైర్మన్‌ ప్రసాద్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, తాజా పరిణామాలను జగన్‌కు వివరించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జగన్ సూచించారు.