హైదరాబాద్: 28°C
క్రీడలు

కోహ్లీకి రుణపడి ఉంటా: పీవీ సింధు

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జపాన్ ఓపెన్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నీకి ముందు రెండేళ్లపాటు సింధు కెరీర్ పరంగా చాలా ఇబ్బందులు పడింది. అయితే, తన కెరీర్ కష్ట కాలంలో ఉన్నప్పుడు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అండగా ఉన్నట్లు సింధు పేర్కొంది. కోహ్లీ మాటలు తనలో స్ఫూర్తి నింపాయని తెలిపింది. తాను కోహ్లీకి ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పుకొచ్చింది.