హైదరాబాద్: 28°C
వార్తలు

'కేంద్రమంత్రి రాజీనామా చేయాలి'

AKP: నీట్ పేపర్ లీకేజ్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎం బాలాజీ మంగళవారం డిమాండ్ చేశారు. ఛలో పార్లమెంట్ పిలుపులో భాగంగా ఢిల్లీలో నిరసన చేస్తున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీ చార్జీ చేయడం అత్యంత దుర్మార్గం అన్నారు. నిరసనగా అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆందోళన చేపట్టారు.