హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంకుడు గుంతల ఆవశ్యకతపై అవగాహన

JGL: నీటి కొరతను నివారించేందుకు ఇంకుడు గుంతల నిర్మాణం ఎంతో అవసరమని మున్సిపల్ కమిషనర్ వీ.రాఘవేంద్ర అన్నారు. మంగళవారం కోరుట్ల పట్టణంలోని పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించి విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. జల సంరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కోరారు.