హైదరాబాద్: 28°C
క్రీడలు

సింధుపై సైనా ప్రశంసలు

జపాన్ ఓపెన్‌లో చరిత్రాత్మక విజయం సాధించిన స్టార్ షట్లర్ పి.వి.సింధుపై మాజీ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ప్రశంసలు కురిపించింది. ఒక ఛాంపియన్‌ను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని, ఈ టైటిల్‌తో సింధు తన సత్తాను మరోసారి చాటిందని, గాయాల నుంచి కోలుకుని, ఒత్తిడిని అధిగమించి సింధు సాధించిన ఈ విజయం ఆమెలో తిరిగి ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని సైనా ఆశాభావం వ్యక్తం చేసింది.