హైదరాబాద్: 28°C
క్రీడలు

DSP సిరాజ్ ఆన్ డ్యూటీ..!

టీమిండియా స్టార్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ పోలీస్ యూనిఫామ్‌లో రాష్ట్ర నూతన డీజీపీ సి.వి. ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశాడు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించినందుకు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపాడు. ఈ ఆత్మీయ భేటీకి సంబంధించిన ఫొటోలను సిరాజ్ సోషల్ మీడియాలో పంచుకుంటూ, ప్రజలకు సేవ చేయడంలో డీజీపీ నిరంతర విజయం సాధించాలని సిరాజ్ ఆకాంక్షించాడు.