హైదరాబాద్: 28°C
వార్తలు

'ఆధార్ క్యాంపులు ఏర్పాటుకు పోస్టల్ శాఖ సిద్దం'

VZM: గజపతినగరంలోని అన్ని గ్రామాల్లో ఆధార్‌ క్యాంపులు నిర్వహించేందుకు పోస్టల్‌ శాఖ సిద్ధంగా ఉందని పోస్టల్‌ అధికారి ఉపేంద్ర సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ గ్రామస్థులు కోరితే వారి గ్రామంలో ఆధార్‌ నమోదు,సవరణ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని,ఆధార్‌ అప్‌డేట్ కోసం ప్రజలు పట్టణాలకు వెళ్లకుండా ఇంటి సమీపంలో సేవలు అందించేలా పోస్టల్‌ శాఖ చర్యలు చేపట్టిందన్నారు.