హైదరాబాద్: 28°C
వార్తలు

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్‌కు అడుగులు

GNTR: ఏపీలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రతినిధుల బృందం సీఎం చంద్రబాబుతో మంగళవారం చర్చలు జరిపింది. రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ నేతృత్వంలోని బృందం పాల్గొంది. ఆహార శుద్ధి రంగంలో వ్యాల్యూ చైన్ ఏర్పాటుతో పాటు ఏపీ ప్రభుత్వం–యూఏఈ భాగస్వామ్యంపై చర్చించారు.