హైదరాబాద్: 28°C
వార్తలు

పంటల బీమాపై రైతులకు అవగాహన

VZM: జామి రైతు సేవా కేంద్రంలో ఏవో పూర్ణిమ ఆధ్వర్యంలో మంగళవారం పంటల బీమాపై రైతులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ సహాయ సంచాలకులు భానులత హాజరై పంటల బీమాపై రైతులకు అవగాహన చేపట్టారు. ఆగస్టు 15వ తేదీలోగా రైతులు ఖరీఫ్ పంటలకు సంబంధించి బీమా చేయించుకోవాలని సూచించారు.