PDPL: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు 85% పెంచేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ శ్రీ హర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో వైద్య ఆరోగ్యశాఖ పనితీరుపై ఆయన సమీక్ష జరిపారు. గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. HPV టీకాలపై అవగాహన కల్పించాలని, NCD సంబంధించిన మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
వార్తలు
'ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంచాలి'


