TG: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో భారీ చోరీ జరిగింది. గురుకృప ఎక్స్‌పోర్ట్స్ కార్యాలయంలో 1,028 గ్రాముల నగలు చోరీ అయ్యాయి. 7 నెక్లెస్‌లు, 7 జతల చెవిపోగులను దుండగులు ఎత్తుకెళ్లారు. డైమండ్ ఫిక్సింగ్ కోసం ఈ నగలను లాకర్‌లో భద్రపరచగా, ఆ నగలను మాయం చేశారు. దుండగులు వాష్‌రూమ్ కిటికీ ధ్వంసం చేసి కార్యాలయంలోకి ప్రవేశించారు. పోలీసులు విచారణ చేపట్టారు.
క్రైమ్
భారీగా నగల చోరీ


