AP: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం, కృష్ణా, NTR జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్పింది. మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తాయని పేర్కొంది.
వార్తలు
ALERT: నేడు వర్షాలు


