హైదరాబాద్: 28°C
వార్తలు

44 మంది దొంగలకు జీవిత ఖైదు

రెండు వేర్వేరు కేసుల్లో అరెస్టయిన 44 మంది సోమాలియా సముద్రపు దొంగలకు ముంబై ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. వీరు ఇరాన్‌కు చెందిన చేపల వేట నౌకతో పాటు, మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను హైజాక్ చేశారు. 17 మంది సిబ్బందిని 90 రోజులకు పైగా బందీలుగా ఉంచి, 60 మిలియన్ డాలర్లు డిమాండ్ చేశారు. దీంతో ఈ కేసుల్లో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.