హైదరాబాద్: 28°C
క్రీడలు

80 సెకన్లలోనే పాక్ నాకౌట్.. టైటిల్ భారత్‌దే!

మలేషియాలో జరిగిన మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) 'స్ట్రైక్ ఏషియా ఛాంపియన్‌షిప్'ను భారత ఫైటర్ సంగ్రామ్ సింగ్ కైవసం చేసుకున్నాడు. ఫైనల్ పోరులో పాకిస్తాన్ ఫైటర్ మహ్మద్ ఆబిద్ అలీని 80 సెకన్లలోనే నాకౌట్ చేసి సంగ్రామ్ ఘన విజయం సాధించాడు. తన అద్భుతమైన పవర్, టాలెంట్‌తో ప్రత్యర్థిని చిత్తు చేసిన ఆయన, ఈ చారిత్రాత్మక విజయాన్ని భారత ప్రజలకు అంకితమిచ్చాడు.