హైదరాబాద్: 28°C
వార్తలు

తెలంగాణకు రూ.200 కోట్ల అదనపు నిధులు

TG: మాతా-శిశు ఆరోగ్య సేవల్లో తెలంగాణ దేశంలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. రాష్ట్రంలో గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు అందుతున్న నాణ్యమైన వైద్య సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకం ప్రకటించింది. నేషనల్ హెల్త్ మిషన్ (NHM) కింద రూ.200 కోట్ల అదనపు నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో ఆసుపత్రులను మరింత బలోపేతం చేయనున్నారు.