హైదరాబాద్: 28°C
క్రైమ్

ఇద్దరు భారతీయులు అరెస్టు

చైనా సిగరెట్లను అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు భారతీయులను శ్రీలంక పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.79.8 లక్షల విలువైన 50 వేలకు పైగా సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాంబోడియాలో కొనుగోలు చేసిన ఈ సిగరెట్లను శ్రీలంక మీదుగా మలేసియా తరలిస్తుండగా విమానాశ్రయంలో దొరికిపోయారు. నిందితుల్లో ఒకరు హైదరాబాద్, మరొకరు ముంబైకి చెందినవారు.