హైదరాబాద్: 28°C
వార్తలు

రైతులు పంట బీమా రక్షణ పొందండి: కలెక్టర్

కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్‌లో కలెక్టర్ బాలాజీ అధ్యక్షతన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన - ఖరీఫ్ 2026 జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం సోమవారం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఖరీఫ్ - 2026 సీజన్‌కు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద అర్హులైన రైతులందరూ తప్పనిసరిగా నమోదు చేసుకొని,పంటల బీమా రక్షణ పొందాలని తెలిపారు.