హైదరాబాద్: 28°C
క్రీడలు

రోహిత్-కోహ్లీ జోడీ సరికొత్త రికార్డ్

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జోడీ సరికొత్త రికార్డు నెలకొల్పింది. అన్ని ఫార్మాట్లలో కలిపి ఈ జోడీ భారత్ తరఫున 54 హాఫ్ సెంచరీల భాగస్వామ్యాలు నమోదు చేసింది. ఈ క్రమంలో గంభీర్-సెహ్వాగ్ (53) రికార్డును అధిగమించి మూడో స్థానానికి చేరింది. ఈ జాబితాలో గంగూలీ-సచిన్ (83) తొలి స్థానంలో, ద్రవిడ్-సచిన్ (74) రెండో స్థానంలో ఉన్నారు.