సత్యసాయి: పెనుకొండ మండలం మోటువారుపల్లిలో రక్షణ కంచె లేకుండా ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. ట్రాన్స్‌ఫార్మర్ బహిరంగంగా ఉండటంతో చిన్నారులు, పశువులు పొరపాటున సమీపానికి వెళ్లే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ భద్రతా కంచె ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు.
వార్తలు
మోటువారిపల్లిలో రక్షణ కంచె లేని ట్రాన్స్‌ఫార్మర్


