హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు వాహనాల బహిరంగ వేలం..

WGL: నర్సంపేట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను మంగళవారం (రేపు) ఉదయం 10 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ CI నరేశ్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. వేలంలో పాల్గొనాలనుకునే వారు ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులతో రేపు ఉదయం 9 గంటల లోపు ఎక్సైజ్ స్టేషన్‌కు హాజరుకావాలని సూచించారు.