హైదరాబాద్: 28°C
క్రీడలు

ఇమ్రాన్ ఖాన్ సోదరికి బిగ్ షాక్!

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి నోరీన్ నియాజీకి అక్కడి సైబర్ క్రైమ్ ఏజెన్సీ సమన్లు జారీ చేసింది. మే 2025 భారత్-పాక్ ఘర్షణల్లో పాక్ సైన్యం విఫలమైందని, సైనికాధికారులు పీఎం మోదీతో కుమ్మక్కయ్యారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్-పాక్ సంబంధాలపై కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రతిష్ఠను దిగజార్చారనే ఆరోపణలపై రేపు ఆమెను విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.