హైదరాబాద్: 28°C
క్రీడలు

చరిత్ర సృష్టించిన రో-కో జోడీ..!

ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో వన్డే ద్వారా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో కలిసి 400 మ్యాచ్‌లు ఆడిన తొలి భారతీయ జోడీగా వీరు రికార్డుకెక్కారు. ప్రపంచ క్రికెట్‌లో శ్రీలంక మాజీ దిగ్గజాలు మహేల జయవర్ధనే, కుమార సంగక్కర జోడీ 550 మ్యాచ్‌లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.