హైదరాబాద్: 28°C
వార్తలు

'విద్యార్థులకు న్యాయం చేయాలి'

KDP: బద్వేల్‌లో RYA ఆధ్వర్యంలో నిరసన చేపట్టి, నీట్ పేపర్ లీక్ అంశంపై దీక్ష చేస్తున్న సామాజికవేత్త సోనం వాంగ్‌చుక్ అరెస్టును ఖండించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించి,పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపాలని RYA రాష్ట్ర కో- కన్వీనర్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత కల్పించి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు.