హైదరాబాద్: 28°C
వార్తలు

దివ్యాంగుల సదరం సర్టిఫికెట్ల జాప్యంపై జేసీకి ఫిర్యాదు

కోనసీమ: అమలాపురం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో లాంప్ కోఆర్డినేటర్ బడుగు సుబ్బాయమ్మ జేసీ వైఖోం నైదియా దేవికి ఫిర్యాదు చేశారు. 2025 ఆగస్టులో రీ-అసెస్మెంట్ జరిగినా ఇప్పటికీ సదరం సర్టిఫికెట్లు అందకపోవడంతో దివ్యాంగులకు సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన జేసీ, సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.