హైదరాబాద్: 28°C
వార్తలు

మాజీ MLA కైలే అనిల్‌పై కేసు నమోదు

AP: కృష్ణా జిల్లా పామర్రు మాజీ MLA, YCP నేత కైలే అనిల్‌పై కేసు నమోదైంది. నిన్న ఫిర్యాదు కోసం పామర్రు పోలీస్‌‌స్టేషన్‌కు అనుచరులతో వచ్చి అనిల్ గొడవ చేశారు. దీంతో తమ విధులకు అడ్డుపడ్డారంటూ హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు అనిల్‌తో పాటు మరికొందరు YCP నేతలపై 126(2), 221 రెడ్‌విత్‌ 190 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.