హైదరాబాద్: 28°C
వార్తలు

ఒకే ఇంట్లో రెండు సార్లు చోరీ..!

W.G: తణుకులోని వరుస బైక్ చోరీలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా బ్యాంకు కాలనీలో ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్న వైద్యుడు దేవసహాయంకు చెందిన బైక్ ఆదివారం అపహరణకు గురైంది. పార్కింగ్ చేసిన వాహనం తెల్లారేసరికి కనిపించకపోవడంతో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏడాది క్రితం ఇదే ఇంట్లో అద్దెకు ఉన్న వ్యక్తికి చెందిన బైక్ గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు.