హైదరాబాద్: 28°C
క్రీడలు

మీ సినిమాలో నటించేందుకు సిద్ధం: సింధు

స్టార్ షట్లర్ పీవీ సింధు జపాన్ ఓపెన్‌లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెకు దర్శకుడు రాజమౌళి శుభాకాంక్షలు తెలిపాడు. దేశం నిన్ను చూసి గర్విస్తుందని ట్వీట్ చేశాడు. దీనిపై సింధు స్పందిస్తూ.. 'థాంక్యూ రాజమౌళి గారు.. వారణాసి మూవీ కోసం ఎదురుచూస్తున్నా. మీ సినిమాల్లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పాత్ర ఉంటే నటించేందుకు నేను సిద్ధం' అంటూ రిప్లై ఇచ్చింది.