ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డే తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై రోహిత్ స్పందించాడు. తాను అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి బయట ఎన్నో రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయని తెలిపాడు. అయితే, తన దృష్టంతా జట్టు విజయంపైనే ఉందన్నాడు. బయట వచ్చే విమర్శలు తనపై ఎలాంటి ప్రభావం చూపవని స్పష్టం చేశాడు.
క్రీడలు
రిటైర్మెంట్ వార్తలపై స్పందించిన రోహిత్


