హైదరాబాద్: 28°C
క్రైమ్

అల్ఫ్రాజోలం యూనిట్ గుట్టురట్టు 

TG: మహబూబ్‌నగర్ భూత్పూర్‌లో ఈగల్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. కోళ్ల ఫారంలో నిర్వహిస్తున్న అల్ఫ్రాజోలం తయారీ యూనిట్ గుట్టురట్టు అయింది. ఈ ఘటనలో 12 మందిని అరెస్ట్ చేయగా 23 మంది పరారీ అయ్యారు. ప్రధాన నిందితుడు జయప్రకాష్ గౌడ్‌గా పోలీసులు గుర్తించారు. గతంలో బోయిన్‌పల్లిలో నిందితుడు మేధా స్కూల్‌లో అల్ప్రాజోలం తయారు చేశాడు.