హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రైవేటు చిట్టీల ,వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసుల సోదాలు

మహబూబాబాద్ జిల్లాలో పోలీసులు సోమవారం ఉదయం విస్తృత సోదాలు నిర్వహించారు. వడ్డీ వ్యాపారులు, ప్రైవేటు చిట్టీల నిర్వాహకుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టి రికార్డులు, పత్రాలను పరిశీలించారు. అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్న పోలీసులు, సంబంధిత వివరాలను సేకరిస్తున్నారు. ఈ ఆకస్మిక సోదాలతో జిల్లావ్యాప్తంగా కలకలం నెలకొంది.