హైదరాబాద్: 28°C
వార్తలు

శిథిలావస్థలో బస్సు షెల్టర్.. ప్రయాణీకుల్లో భయం

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం కొత్తగూడ రహదారి పక్కన ఉన్న బస్సు షెల్టర్ శిథిలావస్థకు చేరి ప్రయాణీకులకు ప్రమాదకరంగా మారింది. పైకప్పు భాగం దెబ్బతినడంతో అక్కడ నిలబడేందుకు ప్రజలు భయపడుతున్నారు. వర్షాకాలంలో ప్రయాణికులు ఎండ,వాన నుంచి రక్షణ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు తెలిపారు. పాత షెల్టర్ నుతొలగించి కొత్త బస్సు షెల్టర్ నిర్మించాలని కోరుతున్నారు.