హైదరాబాద్: 28°C
క్రీడలు

డిసైడర్ మ్యాచ్.. టాస్ ఓడిన భారత్

భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ టాస్ గెలిచింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ బ్యాటింగ్‌కే మొగ్గుచూపాడు. లార్డ్స్‌లో టీమ్‌ఇండియా చివరిసారి 2004లో గెలిచింది. మొత్తంగా ఇక్కడ ఆడిన 9 వన్డేల్లో భారత్‌ నాలుగు గెలిచింది. అందులో 1983 ప్రపంచకప్‌ ఫైనల్‌ ఒకటి. ఇవాళ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది.