హైదరాబాద్: 28°C
క్రీడలు

ఓటమిపై స్పందించిన టీమిండియా కెప్టెన్

ఇంగ్లండ్‌తో మూడో వన్డే ఓటమిపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందించాడు. 45వ ఓవర్ దాకా మ్యాచ్ భారత్ చేతుల్లోనే ఉన్నా, వరుసగా వికెట్లు కోల్పోవడం వల్ల ఫలితం మారిపోయిందన్నాడు. అలాగే బౌలింగ్‌లో ఆఖరి 3 ఓవర్లలో 60 పరుగులు ఇవ్వడం కూడా ఓటమికి కారణమన్నాడు. సిరీస్‌లో అందరూ రాణించడం సానుకూలాంశమని చెప్తూ.. రోహిత్ శర్మ (138) ఇన్నింగ్స్ అద్భుతమని గిల్ కొనియాడాడు.