VZM: రాజాం, చీపురుపల్లిలో 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలకి అనుగణంగా శానిటేషన్, సెక్యూరిటీ గార్డుల సంఖ్య పెంచాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ డిమాండ్ చేశారు. అలాగే జీవో 138 ప్రకారం వేతనాలు పెంచి ప్రతీ నెల 7వ తేదీలోగా చెల్లించాలని చీపురుపల్లి ఏరియా ఆసుపత్రి వద్ద ధర్నా చేశారు. అనంతరం సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు.
వార్తలు
'సెక్యూరిటీ గార్డుల సంఖ్య పెంచాలి'


