హైదరాబాద్: 28°C
వార్తలు

బోనాల జాతరలో పాల్గొన్న కరీంనగర్ డిప్యూటీ మేయర్

KNR: కరీంనగర్ భగత్‌నగర్ వెంకటేశ్వర కాలనీలో ఆషాఢ పోచమ్మతల్లి బోనాల జాతర ఆదివారం ఘనంగా నిర్వహించారు. భక్తులు కొత్త కుండలతో బోనాలలో నైవేద్యం సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై బోనం ఎత్తి ఊరేగింపును ప్రారంభించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి రాష్ట్ర సుభిక్షత కోసం ప్రార్థించారు.