AKP: బాలికలు, మహిళల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు పాయకరావుపేట ఎస్సై ఆలీ అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం పాయకరావుపేటలో విద్యార్థులకు అభయపై అవగాహన కల్పించారు. మహిళలు అపరిచిత వ్యక్తులు పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. అలాగే, సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వేధింపులకు ఎవరైనా పాల్పడితే తక్షణం పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
వార్తలు
'మహిళల భద్రతకు పెద్దపీట'


