హైదరాబాద్: 28°C
వార్తలు

రాజన్న అన్నదాన ట్రస్టుకు భారీ విరాళం

SRCL: వేములవాడ సుభాష్‌నగర్‌కు చెందిన పసుల లక్ష్మీనారాయణ, జనాబాయి దంపతులు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అన్నదాన ట్రస్టుకు రూ.7,01,116 విరాళంగా అందజేశారు. స్వామివారి ఆశీస్సులతోనే ఈ విరాళం అందించే అవకాశం లభించిందని లక్ష్మీనారాయణ భావోద్వేగంతో తెలిపారు. ఆలయ అధికారులు దాత దంపతులను సత్కరించి స్వామివారి ప్రసాదం అందజేశారు.