హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: చెత్త ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిన ఎస్సారెస్పీ కాలువ

JGL: మెట్‌పల్లి ఎస్సారెస్పీ కాలువ చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, కోళ్ల అవశేషాలతో నిండిపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. నీటి ప్రవాహం లేక వ్యర్థాలు పేరుకుపోయి దోమలు, ఈగలు విపరీతంగా పెరుగుతున్నాయి. అంటువ్యాధుల భయం వెంటాడుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ కాలువను వెంటనే శుభ్రం చేయాలని అధికారులను కోరుతున్నారు.