హైదరాబాద్: 28°C
క్రీడలు

రోహిత్, కోహ్లీ విషయంలో ఇబ్బందేంటి?: కైఫ్‌

టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, కోహ్లీపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2027 ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ లేకపోతే భారత్‌కు కష్టమని అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికా పిచ్ పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయని తెలిపాడు. అందుకే, రో-కో ఉండాల్సిందే అని స్పష్టం చేశాడు. మంచి ఫామ్ అందుకునే వరకూ వారిని ఎక్కువ మ్యాచులను ఆడించాలని కైఫ్ సూచించాడు.