కోనసీమ: పొన్నమండ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని కొత్తపేట ఈఈ రాంబాబు తెలిపారు. RDSS స్కీమ్‌లో భాగంగా 33 కేవీ పొన్నమండ ఫీడర్ కవర్డ్ కండక్టర్ మార్పిడి, అభివృద్ధి పనుల వల్ల ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కరెంట్ సరఫరా నిలిపివేస్తామన్నారు. ములికిపల్లి, కూనవరం, చింతలపల్లి, పోతుమట్ల గ్రామాలకు సరఫరా ఉండదన్నారు.
వార్తలు
నేడు ఈ గ్రామాల్లో పవర్ కట్


