హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్: కలెక్టర్

ATP: అనంతపురం నగరంలోని కలెక్టరేట్‌లో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు. ఈ సందర్భంగా అర్జీల వివరాల కోసం టోల్ ఫ్రీ 1100కు కాల్ చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రజలు అవసరమైన పత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.